ప్రపంచ వ్యాప్తంగా పండగలా జరుపుకునే వాలంటైన్స్ డే వేడుకలపై పలు ఇస్లామిక్ దేశాలు నిషేదం విధించాయి. వేడుకలు జరుపుకుంటే నేరంగా పరిగణిస్తామని ఇరాన్, పాక్ ప్రభుత్వాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లోనే అన్ని పట్టణాల్లో కాఫీ, ఐస్ క్రీమ్, రెస్టారెంట్లు, ట్రేడ్ యూనియన్ కు నోటీసులు జారీ చేశారు. ప్రేమికులు ఆయ దుకాణాల్లో చేరి వాలెంటైన్స్ డే గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోకుండా చూడాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై పాక్ అధక్ష్యుడు అయూబ్ స్వయంగా స్పందిస్తూ పాకిస్తానీలెవరూ వాలంటైన్స్ డే జరుపుకోవద్దని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పాశ్చాత్య సంస్కృతీని గుడ్డిగా అనుసరిస్తే లాభం కంటే నష్టాలే ఎక్కవగా ఉన్నాయని... మహిళలపై దాడుల సహా పలు సమస్యలకు కారణమైవుతాయని పేర్కొన్నారు. వాలెంటైన్స్ డే ఇస్లాం సంస్కృతీకి వ్యతిరేకమన్నారు. మరో వైపు భారత్ లో నిరసన జ్వాలలు చెలరేగుతూనే ఉన్నాయి. భజరంగ్ దళ్ సహా పలు హిందూ సంస్థలు వాలంటైన్స్ డే జరుపుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాలంటైన్స్ డే వేడుకలు నిర్వహించే కాఫీ,ఐస్ క్రీమ్ షాపులు, రెస్టారెంట్లపై దాడి చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పార్కుల్లో జంటలు కనిపిస్తే వారిని అక్కడే పెళ్లి చేస్తామని పలు హిందూ సంస్థలు హెచ్చరించాయి.
Mobile AppDownload and get updated news