నల్గొండ: టాలీవుడ్ హీరోయిన్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఆదివారం ఖమ్మం నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో నల్గొండ జిల్లా మోతె సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఆమె స్వల్పగాయాలతో బయటపడినట్లు సమాచారం. కారులో ప్రణీతతో పాటు ఆమె తల్లికూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న బైకు ను తప్పించబోయి కారు అదుపుతప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రణీత గండం నుంచి గట్టెక్కడంతో టాలీవుడ్ సినీ రంగంతో పాటు ఆమె అభిమానులు ఊపరిపీల్చుకున్నారు.
Mobile AppDownload and get updated news