26 మంది ఆటగాళ్లతో బీసీసీఐ రూపొందించిన 2015-16 యాన్యువల్ ప్లేయర్ కాంట్రాక్ట్స్ జాబితాలో బ్యాట్స్‌మన్ అజింక్యా రహానేకి ప్రమోషన్ లభించగా సురేష్ రైనా, భువనేశ్వర్ కుమార్‌ల స్థాయి తగ్గింది. ఈ జాబితాలో రహానేకి A గ్రేడ్‌లో చోటు కల్పించిన బీసీసీఐ, A గ్రేడ్‌లో కొనసాగుతున్న సురేష్ రైనా, భువనేశ్వర్ కుమార్‌లని B గ్రేడ్‌కి తగ్గించింది. కిందటేడాది B గ్రేడ్‌లో వున్న రవీంద్ర జడేజాకి C గ్రేడ్‌లో స్థానం కల్పించింది. ఇక ఎం.ఎస్. ధోనీ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌లని A గ్రేడ్‌లోనే కొనసాగించిన బీసీసీఐ... అంబటి రాయుడు, రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, మురళీ విజయ్, శిఖర్ ధావన్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీలకి యధావిధిగా B గ్రేడ్ జాబితాలోనే చోటు కల్పిస్తున్నట్లు స్పష్టంచేసింది. ఇప్పటివరకు B గ్రేడ్‌లో కొనసాగుతున్న ప్రజ్ఞాన్ ఓజాకి ఈసారి జాబితాలో చోటు దక్కలేదు. అలాగే C గ్రేడ్‌లో వున్న ఇంకొంత మంది ఆటగాళ్ల పేర్లు కూడా జాబితాలో కనుమరుగయ్యాయి. హర్బజన్ సింగ్, శ్రీనాథ్ అరవింద్ లాంటి ఆటగాళ్లకి ఈ జాబితాలో C గ్రేడ్ లభించింది.
Mobile AppDownload and get updated news