నారాయణ్ ఖేడ్ ఉపఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. కారు జోరు ఏమాత్రం తగ్గడంలేదు. రౌండ్ రౌండ్ కి ఆధిక్యాన్ని పెంచుకుంటోంది. ఉదయం పదిగంటల వరకు పదిరౌండ్లు పూర్తయ్యాయి. తెరాస అభ్యర్థి పాతిక వేల ఓట్ల అధిక్యంలో ఉన్నారు. తెరాస అభ్యర్థి భూపాల్ రెడ్డి 44 వేల పైచిలుకు ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డికి 18,758 ఓట్లు, తెలుగుదేశం అభ్యర్థి విజయపాల్ రెడ్డికి 8,309 ఓట్లు దక్కించుకున్నారు. ఇంకా 6 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ఖేడ్ లో మొత్తం 1,88,373 మంది ఓటర్లు ఉండగా, ఫిబ్రవరి 13న జరిగిన పోలింగ్ లో 1,54,866 మంది ఓటేశారు.
Mobile AppDownload and get updated news