బాలీవుడ్ హాట్ గర్ల్ రాఖీసావంత్ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. తాజాగా తానూ పోర్న్ స్టార్ అయిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. వివారాల్లోకి వెళితే మాజీ పోర్న్ స్టార్ సన్నిలియోన్ ను కొన్ని రోజుల క్రితం ఓ జర్నలిస్టు ఇబ్బందికర ప్రశ్నలు అడిగిన సంగతి తెలిసిందే. వాటికి చాలా హూందాగా సమాధానమిచ్చి... అందరి మన్ననలు పొందింది సన్ని. అమీర్ ఖాన్ ఆమె వీడియో చూసి... సన్నీకి మద్దతుగా వెళ్లాడు. తాను సన్నీతో నటించడానికి సిద్ధమేనంటూ ట్వీట్ చేశాడు. తాజాగా ఫిల్మ్ మేకర్ అమోల్ పాలేకర్ భార్య కూడా సన్నీ లేఖ రాసి... మెచ్చుకుంది. వీటన్నింటి నేపథ్యంలో బాలీవుడ్ బాంబ్ షెల్ రాఖీసావంత్ చిటపటలాడుతోంది. పోర్న్ స్టార్లకు దేశంలో ఇంత ప్రాముఖ్యతనిస్తారా అంటూ పెదవి విరిచింది. అయితే... నేను కూడా త్వరలో పోర్న్ స్టార్ అవుతా... అంటూ కామెంట్ చేసింది. సన్నిలియోన్ కు లభిస్తున్న మద్దతు, ఆఫర్లు చూసి రాఖీ కుళ్లుకుంటున్నట్టు కనిపిస్తోంది కదూ.
Mobile AppDownload and get updated news