మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ నియోజక వర్గ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి భూపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థుల కన్నా 53,625 ఓట్లు ఆయనకు అదనంగా పడ్డాయి. తెలిసిన వివరాల ప్రకారం... తెరాసకు 93,076, కాంగ్రెస్‌కు 39,451, తెదేపా 14,787ఓట్లు పడ్డాయి. ఖేడ్‌లో ప్రచారం చేసి విజయానికి కారణమైన హరీష్ రావుకు కేటీఆర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్లో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు
Mobile AppDownload and get updated news