మహారాష్ట్ర: గాళ్ ఫ్రెండ్స్ వ్యామోహంలో పడి అడ్డదారి తొక్కిన ఆ యువకుడు చివరకు జైలుపాలయ్యాడు. మన్కాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళ్లినట్లయితే.. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా బార్ఖెడ్ గ్రామానికి చెందిన ఓం ప్రకాష్ రంగనాథ్ అనే యువకుడిని దోపిడీ కేసులో మన్కాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 4.5 లక్షలు విలువచేసే 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నాగ్‌పూర్ లో 12వ తరగతి చదువుతున్న అతని గాళ్ ఫ్రెండ్ ను విచారించడంతో ఓంప్రకాశ్ బాగోతం బయటపడింది. అతని ప్రియురాలి వద్ద నుంచి పోలీసులు విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం..ఓంప్రకాశ్ ఏఢుగురు గాళ్ ఫ్రెండ్స్ ను మేయింటెన్ చేస్తున్నాడని..వారికి ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వాలనే ఆచోనలతో అతను దొంగతనానికి అలవాటు పడ్డాడని తేలింది. గత కొన్ని రోజుల నుంచి మాన్కాపూర్ లో దొంగతనాలు చేయడం మొదటు పెట్టాడు ఓ ప్రకాశ్ . ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లోకి చొరబడి బంగారాన్ని దొంగిలించే వాడని తేలింది. ఇతనిపై ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, వార్ధా, భూషవల్ లో పలు కేసులు నమోదయ్యాయి.
Mobile AppDownload and get updated news