ఖమ్మం: తెలంగాణను సస్యశ్యామలంగా తీర్చిదిద్దటమే తన జీవిత లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ రోళ్లపాడులో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వచ్చే నాలుగేళ్లలో కోటి ఏకరాలు సాగులోకి తీసుకురావడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు సాగునీరు అందిస్తామన్నారు. డిసెంబర్ నాటికి పాలేరు నియోజకవర్గ ప్రజలుకు తాగునీటి సమస్య లేకుండా చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. అలాగే రెండేళ్లలో 2 లక్షల ఇళ్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
Mobile AppDownload and get updated news