హరీష్ పై కేసీఆర్ ప్రసంశలు..
ఖేడ్ విజయంలో హరీశ్ రావు కీలక ప్రాత్ర పోషించారని..ఆయన చొరవతోనే పార్టీ భారీ విజయం సాధించిందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హరీష్ రావుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల బాధ్యత కేటీఆర్ కు అప్పగించినట్లే ..నారాయణ ఖేడ్ బాధ్యతలు తన మేనల్లుడు హరీష్ రావుకు అప్పగించిన విషయం తెలిసిందే. కేటీఆర్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ హరీష్ రావును తక్కువ చేసి చూస్తున్నారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ పుకార్లను తెరదించాలనే ఉద్దేశంతో హరీష్ రావుకు నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతను అప్పగించడం..ఎన్నికల్లో విజయం తర్వాత హరీష్ రావు ను ప్రత్యేకంగా ప్రశంసించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Mobile AppDownload and get updated news