రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016 రైల్వే బడ్జెట్ పై దేశ వాసులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈసారి బడ్జెట్లో తమకేమైనా మేలు చేస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. గురువారం నాడు సురేశ్ ప్రభు పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ను సమర్పించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు ఆయన తమ ప్రాంతానికి ఏ వరాన్ని ప్రకటిస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది బడ్జెట్ ను ఆయన సాదాసీదాగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ బడ్జెట్లో ఆయన ఏ కొత్త రైలును ప్రకటించలేదు. దానికి బదులుగా ఉన్నవాటినే పొడిగించారు. ఆంధ్రులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న విశాఖపట్టణం రైల్వే జోన్ వ్యవహారం ఈ బడ్డెట్లో తేలే అవకాశం ఉంది. ఎప్పటినుండో ఆంధ్రులను ఊరిస్తున్న విశాఖ జోన్ ను ఆయన ఈ బడ్జెట్లో ప్రకటిస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొన్ని ప్రత్యేక రైళ్లు, సికిందరాబాద్ నుండి విజయవాడ మీదుగా చెన్నైకు ఎప్పటినుండో చెపుతూ వస్తున్న బుల్లెట్ ట్రైన్ విషయంపై తెలుగు వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహిళా బోగీల్లో మరింత మెరుగైన సీసీటీవీ విధానాన్ని మంత్రి ప్రకటించాలని ఎప్పటినుండో డిమాండ్ ఉంది. వాటితోపాటు రైళ్లలో ప్రయాణికుల భద్రతకై సిబ్బంది సంఖ్యను పెంచాలని కూడా వినతులున్నాయి. వీటిపై మంత్రివర్యులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Mobile AppDownload and get updated news