2014, అక్టోబర్ 14వ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు 'మహిషాసురుడి దినోత్సవాన్ని' నిర్వహించారు. 'మహిషారుడి అమరత్వం' పేరుతో కరపత్రాలు ప్రచురించారు. ఆ కరపత్రంలో ఉన్న దాని ప్రకారం... మహిషాసురుడు ఆత్మాభిమానం, ధైర్యం గల నాయకుడు. అతడిని చంపేందుకు ఆర్యులు మాయోపాయాలతో పెళ్లికి ఒప్పించారు. దుర్గాదేవి అనే తెల్లటి చర్మం గల సెక్స్ వర్కర్ తో మహిషాసురుడి పెళ్లి జరిపించారు. తొమ్మిది రోజుల హనీమూన్ తరువాత మహిషాసురుడు నిద్రలో ఉండగానే దారుణంగా దుర్గాదేవి హత్య చేసింది. దుర్గాదేవి పూజ చేయడం జాతి వివక్షపూరిత పూజ.' ఇది ఆ కరపత్రంలో ఉన్న విషయం. మరి రాహుల్ గాంధీ కానీ దీనిపై రభస చేస్తున్న ఇతర విపక్షాలు కాని ఆ కరపత్రాల్లో ఉన్న విషయంపై నోరుమెదపడం లేదెందుకు? పైగా అసలు ఏం జరిగిందో సభలో చెప్పిన మంత్రి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ గులామ్ నబీ ఆజాద్ అడుగుతున్నారు. ఇది ఎంతవరకు సబబు. భావస్వేచ్ఛ అంటే ఇతర మతాలని కించపరచటమా లేక అన్ని మతాలని, అందరి దేవుళ్లని గౌరవించాలన్న కనీసం జ్ఞానం తో ఉండటమా? దేశంలో పలువురి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే?
Mobile AppDownload and get updated news