భారతీయ జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామికి కాన్పూర్ నగరంలో కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో చేదు అనుభవం ఎదురయింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపైకి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కుళ్లిన కోడిగుడ్లు, టమోటాలతో దాడికి దిగారు. ఇంకును కూడా విసిరారు. నలుపు జెండాలను ఊపుతూ రోడ్డుపై బైఠాయించి కారును కదలనివ్వకుండా నిరసన వ్యక్తం చేశారు. శనివారం నాడు కాన్పూర్లోని నవాబ్ గంజ్ ప్రాంతంలోని విఎస్ఎస్డి కళాశాలలో ఒక కార్యక్రమంలో సుబ్రహ్మణ్యస్వామి పాల్గొనాల్సి ఉంది. సుబ్బూ రాకను తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నేతలు, తమ కార్యకర్తలతో కలిసి అక్కడకు చేరుకున్నారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాష్ అగ్నిహోత్రి, జాతీయ కార్యదర్శి అబ్దుల్ మన్నా తదితరుల నేతృత్వంలో ఆందోళనకారులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Mobile AppDownload and get updated news