తన కుమారుడి మరణానికి కారణమైన వ్యక్తులకు శిక్షపడాలని తాను చేస్తున్న పోరాటంలో తోడ్పాటునందించాలని హైదరాబాద్ యూనివర్సిటీ స్కాలర్ వేముల రోహిత్ మాతృమూర్తి రాధిక కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని సోనియాగాంధీని ఆమె నివాసంలో శనివారం రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కేసును పక్కదోవ పట్టించకుండా, బాధ్యులందరికీ శిక్షపడేలా చూడాలని వినతిపత్రాన్ని అందచేశారు. ఈ మేరకు సోనియాగాంధీ ఆమెకు పూర్తి భరోసా ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Mobile AppDownload and get updated news