అవసరమైన వేళల్లో దాన్ని పేస్ వాష్ గా, ఫేస్ మాస్క్ గా ఉపయోగించుకోవచ్చు. అది ఎక్స్ఫోలియేటర్ గా ఉపయోగపడుతుంది. ఎండ వేడిమి వల్ల కమిలిపోయిన ముఖానికి, శరీరానికి అది ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని మృతకణాలను తొలగించడమే కాకుండా నల్లబడిన శరీరాన్ని తెల్లబరుస్తుందని ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ మీనాక్షి దత్ చెప్పారు.
ఫేసియల్స్ కు వెళ్లేంత సమయంలేనప్పుడు వంటింట్లోని బేకింగ్ సోడా అద్భుతంగా అక్కరకొస్తుంది. దాన్ని నిమ్మరసంతో కలిపి ముఖంపై రాయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. నిద్రకు ముందు దాన్ని డ్రై షాంపూగా కూడా ఉపయోగించుకోవచ్చు. శరీరంలోని ట్యాన్ తొలగిస్తుందిది. అంతే కాదు అండర్ ఆర్మ్స్, మోచేతులు, మోకాళ్లపై నలుపును ఇది పోగొడుతుంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాకు సమానంగా నిమ్మరసం కలిపి గట్టి మిశ్రమంగా తయారుచేసి ఆయా ప్రాంతాల్లో సమానంగా రాసి పదినిమిషాల తరువాత కడిగేయాలి. అలా కొంత కాలం చేసి ఫలితం చూడండి. మీరే ఆశ్చర్యపోతారు.
Mobile AppDownload and get updated news