ఏపీ ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపిణీ, అప్పుల కేసును మంగళవారం విచారించిన అత్యన్నత ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. విజభన అనంతరం ఏపీ , తెలంగాణ మధ్య విద్యాసంస్థల పంపిణీ వ్యవహారం, అప్పుల విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న విద్యాసంస్థలన్నీంటిపై ఏపీకి కూడా సమాన హక్కు ఉందని... ఇందులో కూడా తమకు వాటా కావాలని ఏపీ సర్కార్ వాదించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా తన వాదన్ను బలంగానే వినిపించింది. ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తులు ఆ ప్రాంతానికే చెందుతాయని కేవలం సేవలు మాత్రమే అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదించారు. సుధీర్ఘకాలంగా నడుస్తున్న ఈ కేసులో ఇరువైపుల నుంచి వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.
Mobile AppDownload and get updated news