Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85948

గూగుల్ కార్ యాక్సిడెంట్ చేసింది..

$
0
0

ఇటీవలి వరకు సెర్చింగ్ దిగ్గజం గూగుల్ సంస్థ తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ గురించి ఎన్నో గొప్పలకు పోయింది. డ్రైవర్ అవసరం లేకుండా ఎటువంటి ప్రమాదాలకు చోటివ్వకుండా సురక్షితంగా గమ్యానికి చేర్చే కారుగా గూగుల్ కారు పేరుతెచ్చుకుంది. కానీ ఆ తరువాత గత నెల 14వతేదీన వేలంటైన్స్ డే రోజు పరిస్థితి తిరగపడింది. ఆ రోజు ఆ కారు కాలిఫోర్నియాలో ఒక రోడ్డుపై ప్రయాణిస్తుండగా దాని దారికి ఒక ఇసుక బస్తా అడ్డుగా వచ్చింది. దాంతో ఆ కారు ముందుకు ప్రయాణించే అవకాశం లేకుండా పోయింది. ఆ ఇసుక బస్తాను దాటుకుని వెళ్లడానికి ఆ కారు ఎడమ పక్కనే నెమ్మదిగా సాగుతున్న ట్రాఫిక్ మధ్యలోకి ప్రవేశించేందుకు యత్నించింది. ఆ సమయంలో ఒక మునిసిపల్ బస్సు దానికి సమీపంలోకి వచ్చింది. ఆ బస్సు తనను చూసి ఆగి దారి ఇస్తుందని కారులోని రోబో సెన్సార్ భావించింది. కానీ, అలా జరగలేదు. ఆ బస్సు అలాగే ముందుకు కదిలింది. సరిగ్గా అదే వేళ గూగుల్ కారు కూడా కదలింది. దాంతో అది ఆ బస్సును డీకొంది. ఈ ఘటనలో బస్సు భాగాలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులకు, డ్రైవరుకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. ప్రమాదం జరిగిన సమయంలో గూగుల్ కారు రెండు మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. బస్సు పదిహేను మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. అయితే ఈ ప్రమాదం గురించి గూగుల్ సంస్థ తొలుత పెద్దగా పట్టించుకోనట్లే కనిపించింది. తమ కార్లకున్న రోబో సెన్సార్లు మనుషులకు దీటుగా వ్యవహరిస్తాయని, ఇప్పటి వరకు తమ కార్లు ఒక్కసారి కూడా ప్రమాదానికి కారణం కాలేదని ఆ సంస్థ వాదించింది. అందులో నిజం లేకపోలేదు. గతంలో జరిగిన ప్రమాదాల్లో మనుషులు నడిపే వాహనాలే గూగుల్ కార్లను డీకొన్న సందర్భాలున్నాయి కానీ, గూగుల్ కారు కారణంగా ప్రమాదాలు చోటుచేసుకోలేదు.

అయితే, ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ కారుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. గూగుల్ కార్ లాంటి రోబోటిక్ కారు ఎప్పటికి మానవ డ్రైవరుకు సాటిరాదని, ప్రమాదాల వేళ, సంక్లిష్టమైన ట్రాఫిక్ సందర్భాల్లో మనుషులు చాకచక్యంగా స్పందించినట్లు రోబోలు స్పందించలేవనే వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. గూగుల్ కారు ప్రమాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రోబో కార్లను సమర్థించేవారిగా, సమర్థించనివారిగా నెటిజన్లు విడిపోయారు.

ఇదిలా ఉండగా, ఈ ప్రమాదంపై గూగుల్ సంస్థ స్పందించింది. ఈ ప్రమాదం విషయంలో కొంత బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తన కార్లలో మార్పులు చేయనున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా చూస్తానని పేర్కొంది.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85948

Trending Articles