Mobile AppDownload and get updated news
ఆసియా కప్ టి20 టోర్నీలో వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న భారత జట్టు మంగళవారం నాడు కూడా అదే ఊపును కొనసాగించింది. శ్రీలంకతో మీర్పూర్లో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో విజయడంకా మోగించి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఆది నుండి ఆ జట్టును కట్టడి చేసారు. ఇండియా, శ్రీలంకల మధ్య జరుగుతున్న ఆసియా కప్ టి20 క్రికెట్ మ్యాచ్ లో లంకేయులు నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసారు. భారత బౌలర్ల దాటికి తొలుత తడబడినప్పటికీ ఆ తరువాత లంకేయ బ్యాట్స్ మేన్లు నిలదొక్కుకున్నారు. మీర్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. బారత బౌలర్లు నెహ్రా, బుమ్రాలు విజృంబించి బౌలింగ్ చేశారు. ఓపెనర్లుగా రంగంలోకి దిగిన చండిమాల్(4), దిల్షాన్ (18) తక్కువ పరుగులకే పెవిలియన్ దారిపట్టారు. షెనాన్ జయసూర్య(3), మాథ్యూస్ (18) కీలక సమయంలో వికెట్లు పడవేసుకుని నిరాశపరిచారు. ఈ దశలో జట్టు కుప్పకూలిపోతోందనుకున్నారు. 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లంకను మిడిలార్డర్ బ్యాట్స్ మేన్లు కపుదెగర (30), సిరివర్దనే (22) ఆదుకున్నారు. వీరి వల్ల 100 పరుగుల అంకెను లంక దాటగలిగింది. ఐదో వికెట్ కు 5.1 ఓవర్లలో 43 పరుగుల భాగస్వామ్యంతో 100 పరుగులు చేసారు. వీరి తరువాత పెరీరా (17), కులశేఖర (13నాటౌట్) వల్ల 138 పరుగులు చేయగలిగింది.