ఆఫ్గనిస్తాన్తోని జలాలాబాద్లో ఉన్న భారత కాన్సులేట్‌పై మళ్లీ ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. మొదట ఒక ఉగ్రవాది బాంబు అమర్చిన కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇండియన్ కాన్సులేట్ ముందు పేల్చేశాడు. దీంతో అక్కడే ఉన్న ఎనిమిది కార్లు బుగ్గయ్యాయి. కార్లో ఉన్న ఉగ్రవాది మరణించాడు. ప్రజలకు, అధికారులకు ఎలాంటి హాని జరుగలేదు. నలుగురు ఉగ్రవాదులు కాన్సులేట్ భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో భద్రతా దళాలు కాల్చి చంపినట్టు ఆఫ్గన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఎంబసీ అధికారి వికాస్ స్వరూప్ మాట్లాడుతూ 'మన కాన్సులేట్ పై దాడి జరిగింది. అందరం సురక్షితంగా ఉన్నాం' అని తెలిపారు. ఇంతవరకు ఈ దాడి చేసింది మేమే అంటూ ఏ ఉగ్రవాద గ్రూపు ప్రకటించుకోలేదు. ఇండియన్ కాన్సులేట్‌పై జనవరి మొదటి వారంలో కూడా ఉగ్రదాడులు జరిగాయి. అప్పుడు ఇస్లామిక్ స్టేట్ తామే చేసినట్టు ప్రకటించింది. అప్పుడు కేవలం ఇండియన్ కాన్సులేట్‌పైనే కాకుండా, పాక్ కాన్సులేట్‌పై కూడా దాడి జరిగింది. తరచూ ఈ ప్రాంతంలో ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి.
Mobile AppDownload and get updated news