మణిపూర్ హక్కుల కార్యకర్త ఇరోం షర్మిల మళ్లీ అరెస్ట్ అయ్యారు. ఆమెను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె పదిహేనేళ్లుగా నిరశన దీక్ష చేస్తున్నారు. ఆమె ఎటువంటి ఆహారం తీసుకోకుండా నిరశన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న కారణంగా పోలీసులు ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసుల నిర్బంధంలో ఉన్నప్పటికీ ఆమె ఆహారాన్నీ తీసుకునేందుకు నిరాకరించడంతో బలవంతంగా ముక్కు ద్వారా ఆమెకు ద్రవరూపంలో ఆహారాన్ని అందిస్తూ వచ్చారు. ఇటీవలే ఆమెను విడుదల చేశారు. విడుదలైన తరువాత కూడా ఆమె తన దీక్షను మళ్లీ కొనసాగించడం ప్రారంభించారు. దాంతో మళ్లీ ఆమెను అరెస్ట్ చేశారు. వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు.
Mobile AppDownload and get updated news