Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85967

'కనితన్' తెలుగు రీమేక్‌లో రవితేజ

$
0
0

తమిళంలో హిట్ అయిన కనితన్ మూవీ తెలుగులోకి రీమేక్ చేయనున్నట్టు స్పష్టంచేశాడు ఆ సినిమా డైరెక్టర్ టీఎన్ సంతోష్. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో నటించమని అడిగేందుకు హైదరాబాద్ వచ్చి వెళ్లిన సంతోష్.. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించేందుకు రవితేజ అంగీకరించినట్టుగా చెన్నైలో చెప్పాడు. రవితేజ చేతిలో మరో రెండు ప్రాజెక్టులున్నప్పటికీ ఈ సినిమా చేసేందుకు అంగీకరించినందుకు అతడికి కృతజ్ఞతలు తెలిపాడు సంతోష్. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ కథని తీర్చిదిద్దుతానని చెప్పాడు సంతోష్. మొదట్లో కనితన్ సినిమాని అల్లు అర్జున్‌తో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించాలని సంతోష్ భావించినప్పటికీ... అల్లు అర్జున్ బిజీ షెడ్యూల్ కారణంగా అది సాధ్యపడలేదని సమాచారం. అంతేకాకుండా హిందీలోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85967

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>