తన తనయుడు లోకేష్ ..రాజధాని ప్రాంతంలోని హాయ్ ల్యాండ్ భూములను కబ్జా చేశాడని ప్రతిపక్షాలు దుమ్మతిపోయడం బాధాకరమన్నారు.. ఆ భూమలు అగ్రిగోల్డ్ నుంచి సీబీఐ జప్తు చేసిన విషయాన్ని ప్రతిపక్షాలు తెలుసుకోవాలని హితవు పలికారు. అలాగే రాజధాని ప్రాంతంలో ఎన్ఆర్ఐ రవి కుమార్ భూమిని కబ్జా చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయని.. వాస్తవానికి రవికుమార్ గతంలోనే ఆ భూములను 1.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడని వివరించారు. అలాగే ఎంపీ మురళీ మోహన్ పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. భూకబ్జా కు పాల్పడ్డారని తేలితే ఎంతటి వారినైనా సరే కఠినంగా శిక్షిస్తామన్నారు. తను కానీ.. తన కటుుంబ సభ్యులు కానీ భూ కబ్జాకు పాల్పడ్డామని నిరూపిస్తే ఆ భూములు వారి పేరున రాసిస్తానని చంద్రబాబు వెల్లడించారు.
రాజధాని నిర్మాణం జరగడం ప్రతిపక్షానికి ముందు నుంచే ఇష్టం లేదని.. అందుకే నిర్మాణ పనులను అడుగడుగున అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తుంటే ..వారిని రెచ్చగొట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారన్నారు. తీరా భూములు ఇచ్చాక నష్టపరిహారంపై అతస్య పుకార్లు వినిపిస్తున్నారని మండిపడ్డారు. ఇది చాలదన్నట్లు రైతుల భూములతో వ్యాపారం చేస్తున్నమనడం దారుణమన్నారు. ఇలాంటి ప్రతిపక్షాన్ని చరిత్రలో తాను ఎప్పడు.. ఎక్కడా చూడలేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతలు భూదందా నాటకాన్ని ఇప్పటికైనా మానుకొని రాజధాని నిర్మాణానికి సహకరించాలని.. లేదంటే చరిత్రహీనులుగా నిలిచిపోతారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
Mobile AppDownload and get updated news