హైదరాబాద్: తన కూతురిని వేధించాడని ఫిర్యాదు చేసినందుకు తమపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని ఉప్పల్ పోలీస్ స్టేషన్ మధుప్రియ తల్లిదండ్రులు శ్రీకాంత్ పై మరోసారి ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ తో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీకాంత్ శనివారం అర్థరాత్రి సమయంలో 20 మంది గ్యాంగ్ తో వచ్చి తమపై దాడికి ప్రయత్నించాడని మధుప్రియ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా మధుప్రియను కలిసేందుకు వెళ్లిన తనపై ఆమె బంధువులు కర్రలతో దాడి చేశారని శ్రీకాంత్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. దీంతో మధుప్రియ కేసు మరింత జఠిలంగా మారింది
Mobile AppDownload and get updated news