Mobile AppDownload and get updated news
అయిదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన అయిదు రోజుల పాటూ హైదరాబాద్ లోని బేగంపేటలో బుధవారం నుంచి జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రణబ్ ముఖర్జీ హాజరవ్వనున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు కూడా వస్తారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. విమానాశ్రయ పరిసరప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తున్నారు. విమానాశ్రయం బయట 632 మంది పోలీసులు పహారా కాస్తారు. లోపల కేంద్రబలగాలు మోహరిస్తాయి. అసలే ఉగ్రవాదుల కన్ను హైదరాబాద్ పై ఉందని ఇంతకుముందే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసు అధికారులు. విమానాశ్రయం చుట్టూ ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సీసీ కెమెరాలను పెట్టారు. కాగా అయిదు రోజుల పాటూ జరిగే ఈ కార్యక్రమంలో 17,18 తేదీలలో వీవీఐపీలు, వ్యాపారసంస్థల ప్రతినిధులకు మాత్రం ప్రవేశం ఉంటుంది. 19,20 తేదీలలో సాధారణ ప్రజలకు ప్రవేశం ఉంటుంది. టిక్కెట్లను బుక్ మై షో, ఇండియా ఏవియేషన్ వెబ్ సైట్లలో కొనుక్కోవాలి.