హాట్ హాట్ మోడల్ పూనం పాండే... గతంలో టీమిండియా గెలిస్తే న్యూడ్ గా డ్యాన్స్ చేస్తానంటూ ప్రకటించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు పాక్ లో మరో పూనం పాండే వెలుగులోకి వచ్చింది. కాందీల్ బాలోచ్ అనే మోడల్ పాక్ జట్టుకు ఓ ఆఫర్ ని ఇచ్చింది. టీ20 ప్రపంచకప్ లో మార్చి 19న భారత్ తో జరిగే మ్యాచులో గెలిస్తే... పాకిస్తాన్ ప్రజల ముందు నగ్నంగా నాట్యం చేస్తానంటూ ప్రకటించింది. ఈ విషయాన్ని చెబుతున్న వీడియోని ఫేస్ బుక్ లో అప్ చేసింది. అంతేకాదు ఆ డ్యాన్స్ ను పాక్ కెప్టెన్ ఆఫ్రిది అంకితమిస్తానని అంది. పాక్ లో ఇంత బోల్డ్ గా అమ్మాయిలు మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువే. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. కొందరు మాత్రం ... ఆఫర్ల కోసమే ఈ మోడల్ ఇలాంటి పనులు చేస్తోందంటూ కొట్టిపడేశారు.
Mobile AppDownload and get updated news