Mobile AppDownload and get updated news
హైదరాబాద్: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మహిళలకు ఈ ప్రభుత్వం మోసం చేసిందని సభలో వైసీపీ ఆరోపించింది. బుధవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు మహిళాసాధికారతపై పలు ప్రశ్నలు సంధించారు. అలాగే డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు జాప్యం చేస్తున్నాయని ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి..ఇప్పటి వరకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయలేకపోయారని విమర్శించారు. వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి పత్తిపాటి సమాధానం ఇచ్చారు. దశల వారీగా రుణమాఫీ చేస్తున్నామని .. ఇదే అంశాన్ని గతంలో అనేక సార్లు తెలిపామన్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు రుణాల మంజూరులో ఎదురౌతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రయతిస్తామని మంత్రి పత్తిపాటి హామీ ఇచ్చారు.