రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిల్ పై తక్షణమే విచారణ జరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. దానిపై మంగళవారం విచారణ జరిపేందుకు నిరాకరించింది. ఆ పిల్ ను న్యాయవాది మనోహర్ లాల్ శర్మ దాఖలు చేశారు. పౌరసత్వం విషయంలో రాహుల్ గాంధీ పై కేసు నమోదు చేయమని సీబీఐని ఆదేశించాలని, అలాగే నివేదిక నేరుగా సుప్రీంకోర్టుకే ఇవ్వాలని పిల్ లో పేర్కొన్నారు. ఈ పిల్ పూర్వాపరాలను పరిశీలించిన ధర్మాసనం దీనిపై వెంటనే విచారణ చేయాల్సిన అవసరం లేదని తేల్చింది. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరసత్వాన్ని ఎన్నికల సమయంలో కూడా బయటపెట్టలేదని పిటిషనర్ ఆరోపించారు. ఇది భారత ఎన్నికల వ్యవస్థను తప్పుదోవ పట్టించడమే అని అభిప్రాయం పడ్డారు.
Mobile AppDownload and get updated news