ముంబై: అనుష్కతో కనెక్షన్ కట్ చేసుకోబట్టే విరాట్ కోహ్లీ బాగా ఆడుతున్నాడనే కామెంట్స్ పై కోహ్లీ ఘాటుగా స్పందించాడు. అనుష్కపై ఇలాంటి కామెంట్స్ రావడం దురదృష్టకమని.. ఇది సిగ్గుమాలిన చర్య అని ట్వీట్ చేశారు. అనుష్కపై దయ చూపాలని.. అనవసరంగా ఆమోను ఆడిపోసుకుంటున్నారని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఆసీస్ తో టి 20 సిరీస్ నుంచి కోహ్లీ వరుసగా రాణిస్తున్నాడు. తాజాగా ఆదివారం ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 82 పరుగులు చేసి ఒంటి చేత్తో భారత్ ను సెమీస్ చేర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అనుష్కా శర్మను వెటకారం చేస్తూ కామెంట్లు, పోస్టింగ్‌లు చేస్తూ ఆమెను వదిలేయబట్టే కోహ్లీ బాగా ఆడుతున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన మాజీ ప్రియురాలిపై కోహ్లీ తన ప్రేమను ఇలా చాటుకున్నాడు.
Mobile AppDownload and get updated news