ఎమ్మెల్యేల జీతాల పెంపు బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది.అవినీతి రహితంగా ఉండేందుకే శాసనసభ్యుల జీతాలు పెంచినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శాసనసభలో ప్రవేశపెట్టిన ఎమ్మెల్యేల జీతాల పెంపు బిల్లుపై కేసీఆర్ మాట్లాడుతూ బడ్జెట్‌తో పోల్చితే ప్రజాప్రతినిధుల జీతాల పెంపు పెద్ద భారం కాబోదని అన్నారు.జాతి నిర్మాణంలో చట్ట సభల ప్రతినిధులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు చనిపోతే వారి సతీమణికి పూర్తి పింఛను వచ్చేలా సవరణ చేశామని వివరించారు. ఎమ్మెల్యేలకు కారు రుణాలను సైతం పెంచామన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రూ.500 జీతం తీసుకున్నానని, 5 నెలల పాటు తానే కారు నడుపుకున్నానని కేసీఆర్ గుర్తు చేశారు.
Mobile AppDownload and get updated news