జాట్ రిజర్వేషన్ బిల్లుకి హర్యానా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే జాట్‌ల రిజర్వేషన్ బిల్లును హర్యానా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. నిన్న హర్యానా మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ రాష్ట్రంలోని జాట్ వర్గీయులు గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.గత నెలలో జాట్‌ల ఆందోళనల వల్ల ఎన్నో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. తీవ్ర ఆస్తినష్టం జరిగింది. రైల్వేకి, స్థానిక వ్యాపారులకు నష్టం వాటిల్లింది. ఆందోళన సెగ దిల్లీకి కూడా తగిలింది. ఆందోళనకారులు ఢిల్లీకి నీటి సరఫరా చేసే కెనాల్‌ను మూసివేయడంతో రెండు రోజులపాటు నగరం నీటి ఎద్దడిని ఎదుర్కొంది.
![]()
Mobile AppDownload and get updated news