మంగళవారం ఉదయం టీడీపీ చెందిన సర్పంచ్ పై కొందరు దుండగులు హతమార్చేందుకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన అనుచరుడిపై భూమా హత్య చేసేందుకు యత్నించారని అదే పార్టికి చెందిన మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి బహిరంగ ఆరోపణలు చేశారు. అనంతరం చంద్రబాబును కలిసి భూమా పై ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మీడియా ముందు భూమా స్పందించిన విషయం తెలిసిందే. అధిష్టానం ఆదేశాల మేరకు దీనిపై వివరణ ఇచ్చేందుకు బుధవారం ఆయన చంద్రబాబను కలిశారు. చంద్రబాబుతో భేటీలో ఆయన కూతరు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ కూడా పాల్గొన్నారు.
Mobile AppDownload and get updated news