డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రైవేటు ఆస్పత్రులు పనిచేస్తున్నాయని గవర్నర్ నరసింహన్ అన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో వైద్యం వ్యాపారంలా మారిందని.. రోగి ఆస్పత్రికి వస్తే పరీక్షల పేరుతో డబ్బుల వసూలు చేయడమే పరామవధిగా ఆస్పత్రులు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయన్నారు. వైద్యులు రోగిని ముట్టుకునే సాంప్రదాయాన్ని తెరదించి పరీక్షల ద్వారనే రోగాన్ని తెలుసుకునేందుకు పరిమితమయ్యారని విమర్శించారు. వైద్య పరికరాల ఖర్చు రాబట్టుకునేందుకు ఎక్కువ ఫీజులు వసూలు చేయడం తగదని వెల్లడించారు. ఈ విధానంలో మార్పు రావాల్సి ఉందని.. రోగుల పట్ల వైద్యులు మానవత్వాన్ని ప్రదర్శిచాలని సూచించారు. ప్రతీ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం రోగికి అయ్యే ఖర్చు తమ నోటీసు బోర్డులో పెట్టాల్సిందిగా గవర్నర్ నరసింహన్ కోరారు.
Mobile AppDownload and get updated news