రోమన్ కేథలిక్కుల సారథి పోప్ ఫ్రాన్సిస్‌పై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వివాదాస్పద కామెంట్లు చేసాడు. గొప్ప గొప్ప అందగత్తెలని మీడియా భావించే మహిళలతో కన్నా పోప్ ఫ్రాన్సిస్‌తోనే డేట్ చేయడానికి చాలా అవకాశాలున్నాయంటూ రెండు నెలల క్రితం ట్విట్టరులో చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదమై కూర్చుంది. తాను కోట్లాదిమంది ప్రపంచ క్రైస్తవులకు సారథి గురించి కామెంట్ చేస్తున్నాననే విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం వెనకాముందు ఆలోచించకుండా అప్పట్లో అతగాడు పెట్టిన ట్వీటు గురించి ఇటీవల తెలిసిన దేశంలోని మైనారిటీ వర్గాలు ఆగ్రహోద్రేకాలకు లోనయ్యాయి. పోప్ ప్రతిష్టకు భంగం కలిగించేలా హృతిక్ ట్వీట్ ఉందంటూ అతగాడిపై దేశ విదేశాల్లోని క్రైస్తవ వర్గాల నుండి విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆల్ ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ అధ్యక్షుడు అబ్రహాం మథాయ్ హృతిక్ రోషన్‌కు ఐపీసి సెక్షన్ 295 ఎ కింద క్రిమినల్ నోటీసులు పంపారు. ప్రపంచపు అతిపెద్ద మత వర్గ నాయకుడు, వాటికన్ అధిపతిపై హృతిక్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. హృతిక్ అభిమానుల్లో వేలాది మంది క్రైస్తవులు కూడా ఉన్నారని అతగాడు తెలుసుకోవాలని, ఈ చర్యతో వారందరు అతగాడికి దూరమవుతారని హెచ్చరించారు.
Mobile AppDownload and get updated news