మూడు రోజుల పర్యటనలో భాగంగా బెల్జియం చేసుకున్న ప్రధాని మోడీకి ఆ దేశ విదేశంగా మంత్రి ఘన స్వాగతం పలికారు. గౌరవవందనం స్వీకరించిన అనంతరం బ్రస్సెల్స్ మృతులకు మోడీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రస్సెల్ ఘటన దురద్రుష్టకరమన్నారు. భారత్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని.. బ్రస్సెల్ వాసుల బాధ తాము అర్థం చేసుకోగలమన్నారు. ఉగ్రవాదంపై సమిష్టిగా కలిసి పోరాడాల్సిన అవసరముందన్నారు. ఉగ్రపోరులో బెల్జియంతో కలిసి పోరాడేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడీ ఈ సందర్భంగా ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఇవాల్టి షెడ్యూల్ లో భాగంగా అణుభద్రత సదస్సులో మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం ఎన్ఆర్ఐల సదస్సులో పాల్గొంటారు. అనంతరం రాత్రి అమెరికా బయల్దేరి వెళ్లనున్నారు. మోడీ రాక సందర్భంగా బ్రస్సెల్స్ గోడలు పై మోడీ వాల్ పోస్టర్లు వెలిచాయి. అడుగడునా..అక్కడ స్థిరపడిన భారతీయలు మోడీ నినాదాలు చేసి ప్రధాని మోడీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
Mobile AppDownload and get updated news