న్యూయార్క్ నగరంలోని ఆస్పత్రిలో పనిచేసే ఒక నర్సు వైద్య వృత్తికి కళంకం తేవడమే కాకుండా, రోగుల ప్రైవసీకి కూడా భంగం కలిగేలా ప్రవర్తించింది. చివరకు తన నర్సింగ్ లైసెన్సునే కోల్పోవాల్సి వచ్చింది. క్రిస్టెన్ జాన్సన్ అనే ఆ నర్సు తమ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న ఇద్దరు పురుష రోగుల ప్రైవేట్ పార్టులతో ఫోటోలకు ఫోజిచ్చింది. దిగింది దిగనట్లుండక, ఆ ఫోటోలను తానేదొ గొప్ప ఘనకార్యం సాధించినట్లు తోటి ఉద్యోగులకు మొబైల్ ద్వారా షేర్ చేసింది. అంతే ఆ విషయం తెలిసిన ఆస్పత్రి వర్గాలు ఒక్కసారిగా షాకయ్యాయి. ఆమె పని నర్సింగ్ వృత్తికి కళంకం అని ఆగ్రహం చెందారు. ఆమె చేసిన పనిని ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమె చేసిన పని చాలా నీచాతినీచమని, తన చర్యను సమర్థించుకునే నైతికార్హత కూడా ఆ నర్సుకు లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె అసలు నర్సింగ్ వృత్తికి సరిపోదని కోర్టు అభిప్రాయపడుతూ ఇందుకు కఠిన శిక్షే సరయినదని నిర్ణయించింది. అయితే, ఆమె కోర్టును కాళ్లావేళ్లా పడి వేడుకుంది. తన నర్సింగ్ లైసెన్సును ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని, ఇకపై అటువంటి పనులకు ఒడిగట్టనని ప్రాథేయపడటంతో కోర్టు కరుణించింది. ఆమె శిక్షను తగ్గించింది.
Mobile AppDownload and get updated news