గత కొంత కాలంగా ఒకరితో మరొకరు డిస్టన్స్ మెయింటెన్ చేస్తున్న లవ్ కపుల్ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కా శర్మ మళ్లీ కలిసిపోయారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మొత్తం భారాన్ని తానే మోసి సూపర్ పర్‌ఫార్మెన్స్‌తో టీమిండియాకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ ఫ్యాన్స్, క్రీడా ప్రముఖులతో ప్రశంసలు అందుకున్న విరాట్ కోహ్లీ... ఇంకొందరు నెటిజెన్లు సోషల్ మీడియాలో మరోసారి తన మాజీ గాళ్ ఫ్రెండ్ అనుష్కపై విరుచుకుపడటం... అలా అనుష్కపై కామెంట్లు చేసినోళ్లపై కోహ్లీ సీరియస్ అవడం అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి. అయితే తన పర్‌ఫార్మెన్స్‌కి అనుష్కతో డిస్టన్స్ మెయింటెన్ చేయడమే కారణమని కామెంట్ చేసినోళ్లకి అదే సోషల్ మీడియాలో గడ్డిపెట్టే ప్రయత్నం చేసిన తీరు చూస్తోంటే చాలామందికి చాలా సందేహాలు కలుగుతున్నాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్ గెలిచిన రోజు రాత్రి టీమిండియా అంతా సెలబ్రేషన్స్‌లో మునిగితేలితే, విరాట్ మాత్రం చాలాసేపు ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ గడిపాడట. అదంతా చూశాకా... విరాట్ ఇప్పటికీ అనుష్కతో టచ్‌లోనే వున్నాడని టాక్ ఊపందుకుంది. వాళ్లిద్దరూ ఒక ప్లాన్ ప్రకారమే.. డిస్టన్స్ మెయింటెన్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు కానీ ఇది కూడా వాళ్ల లైఫ్ ప్లానింగ్ స్ట్రాటెజీలో ఓ భాగమే కావచ్చంటున్నారు ఆ రోజు విరాట్ ఫోన్‌లో చాలాసేపు మాట్లాడటం చూసినవాళ్లు. ప్రస్తుతం ఆమె సుల్తాన్ సినిమా షూటింగ్‌తో బిజీగా వుండగా... వరుస టూర్లతో విరాట్ బిజీగా వున్నాడు. ఇలా దూరంగా వుండటం వల్ల వారికి మంచే జరిగింది అనే అభిప్రాయంవ్యక్తం చేస్తున్న వాళ్లూ లేకపోలేదు. ఇదిలావుంటే... సోషల్ మీడియాలో అనుష్కకి అండగా నిలిచిన విధానం సైతం విరాట్‌కి ఆమె పట్ల వున్న ఇష్టాన్ని, గౌరవాన్ని తెలియజేస్తోందనేది వారి వాదన.
Mobile AppDownload and get updated news