పారిశ్రామిక దిగ్గజం టాటా స్టీల్ బ్రిటన్ నుండి తన వ్యాపార కార్యకలాపాలను విరమించుకోవాలనే యోచనలో ఉంది. ఇందుకు సంబందించి ఆ సంస్థ ఇప్పటికే బ్రిటన్లో తన వ్యాపార వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ఈ విషయం తెలియడంతో బ్రిటన్ వర్గాలు ఒక్కసారిగా షాకయ్యాయి. ఇదే జరిగితే ఆ దేశం పెద్ద ఎత్తున ఉద్యోగాలను కోల్పోవడం ఖాయం. దీంతో ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ సత్వరమే స్పందించారు. తన మంత్రివర్గంతో అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్చించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితిపై యూరోపియన్ యూనియన్ రిఫరెండం కారణంగా పీకల్లోతు ఒత్తిడిలో ఉన్న కామెరూన్ ప్రభుత్వానికి టాటా స్టీల్ నిర్ణయం శరాఘాతమైంది. టాటా స్టీల్ సంస్థ కనుక బ్రిటన్ నుండి నిష్క్రమిస్తే ఆ దేశం పెద్ద ఎత్తున ఉపాథి అవకాశాలు కోల్పోతుంది. వేలాదిమంది ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడతాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
Mobile AppDownload and get updated news