పవన్‌కల్యాణ్, కాజల్ జంటగా నటించిన 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. రెండు పాటలు మినహా మిగతా చిత్రాన్ని పూర్తి చేసి సెన్సార్ కు పంపగా సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లభించినట్లు చిత్ర బృందం తెలిపింది. దీంతో ఈ చిత్రం ఎలాంటి అవాంతరం లేకుండా ముందు చెప్పినట్లే ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో మిగిలిన రెండు పాటల షూటింగ్ జరుగుతోంది.
Mobile AppDownload and get updated news