ప్రాణాంతకమని అంతా భావించే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో వెలుగులు పూయించే మరొక చారిత్రక ఘట్టానికి హాప్కిన్స్ యూనివర్సిటీ వైద్యులు తెరతీశారు. ఇద్దరు హెచ్ఐవీ రోగుల మధ్య అవయవదానం ప్రక్రియను విజయవంతం చేసారు. ఇది మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిని రోజురోజుకు చావు అంచులకు వెళ్లిపోతున్న హెచ్ఐవీ రోగులకు శుభవార్త కిందే లెక్క. సదరు రోగికి, వేరొక హెచ్ఐవి వ్యాధిగ్రస్తుడైన దాత నుండి సేకరించిన అవయవాన్ని ఇకపై సులభంగా అమర్చవచ్చు. బాల్టిమోర్లోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వైద్యశాలలోని వైద్యులు ఇటీవల ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా వైద్యులు గతంలో తాము హెచ్ఐవీ పాజిటివ్ మూత్రపిండాలను వేరొక హెచ్ఐవీ రోగికి అమర్చామని ప్రకటించారు. దాన్ని లెక్కలోకి తీసుకుంటే హాప్కిన్స్ చేసిన కాలేయమార్పిడిని ప్రపంచపు తొలి హెచ్ఐవి టు హెచ్ఐవీ రోగి అవయవదానంగా చెప్పవచ్చు.
Mobile AppDownload and get updated news