దేశం ఒకవైపు రోజురోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మరోవైపు మూడనమ్మకాలు, అంధవిశ్వాసాలు కూడా దేశాన్ని ఒక పట్టాన వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేవు. మంత్రగాళ్లు, మంత్రగత్తెల ముద్రవేసి అమాయకులను పట్టపగలే జనం చంపేస్తున్నారు. వారి నూరేళ్ల జీవితాలకు బలవంతంగా ముగింపు పలుకుతున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్లో ఒక వృద్ధురాలిపై మంత్రగత్తె ముద్రవేసిన కొందరు గ్రామస్తులు దాడికి దిగారు. వృద్ధురాలు అని కూడా కనీస మానవత్వం కూడా లేకుండా ఆమెను తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుటుంబ సభ్యులకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. మాల్డా జిల్లాలో ఇది జరిగింది. నిందితులను అరెస్ట్ చేసారు.
Mobile AppDownload and get updated news