కోల్‌కతా మృతుల సంఖ్య 17కి చేరింది. ఈ ఘటనలో 100 మందిపైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం నుంచి 70 మంది వరకు సురక్షితంగా బయటపడ్డారు. స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఘటన జరగడం దురద్రుష్టకరమన్నారు. క్షతగాత్రులకు కోల్‌కతాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులో ఉచింతంగా చికిత్స ఇప్పిస్తున్నట్లు ప్రకటించారు.
గురువారం మధ్యాహ్నం నగరంలోని గణేష్ టాకీస్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫైఓవర్ అకస్మాత్తుగా కుప్పకూలిన విషయం తెలిసిందే. .
Mobile AppDownload and get updated news