హృతిక్ రోషన్-కంగనా రనౌత్ న్యాయపోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ట్విస్టులు వెలుగుచూస్తూనే వున్నాయి. గుర్తుతెలియని వ్యక్తి తన పేరిట తన ఫీమేల్ ఫ్యాన్‌కి ఈమెయిల్స్ పంపిస్తున్నాడని 2014, డిసెంబర్‌లో ముంబై పోలీసులకి ఫిర్యాదు చేసిన హృతిక్... తాజాగా ఆ ఫీమేల్ ఫ్యాన్ పేరుని బహిర్గతం చేశాడు. తాజాగా కంగనా రనౌత్ పేరుని మొదటిసారిగా ఎఫ్ఐఆర్‌లో పొందుపర్చడం జరిగింది. అప్పట్లోనే కంగనా రనౌత్ పేరుని బయటికి వెల్లడిస్తే, ఆమెకి అసౌకర్యంగా వుండటంతోపాటు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం వుందనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు హృతిక్ ఆమె పేరుని రహస్యంగా వుంచినట్టు తెలుస్తోంది. హృతిక్ ఫిర్యాదు అనంతరం కంగనా రనౌత్‌కి, ఈ వివాదానికి సాక్షిగా వున్న ఆమె సోదరి రంగోలికి ముంబై సైబర్ సెల్ పోలీసులు సమన్లు జారీచేశారు. వారం రోజుల్లోగా తమ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా ఈ సమన్లలో పేర్కొన్నారు.
Mobile AppDownload and get updated news