అనుమతి లేకుండా తమ గగనతలంలోకి ప్రవేశించిందన్న కారణంగా ఓ యుద్ధ విమానాన్ని టర్కీ సేనలు మంగళవారం కూల్చేశాయి. మొదట్లో ఆ దేశానికి చెందిన యుధ్దవిమానమో తెలియలేదు. ఘటన జరిగిన కాసేపటికే రష్యా ఆ విమానం తమదేనని ప్రకటించింది. సుఖోయ్ 24 రకానికి చెందిన యుద్ధ విమానమి చెప్పింది. కాగా ఆ విమానం కూల్చివేతకు ముందు దాదాపు పదిసార్లు హెచ్చరించామని టర్కీ అధికారులు తెలిపారు. కూల్చివేతకు కొన్ని నిమిషాల ముందు ఇద్దరు పైలట్లు పారాచూట్ల సాయంతో దూకేసినట్టు రష్యా తెలిపింది. అయితే వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పింది. వారు సురక్షితంగా ఉన్నారా, ప్రమాదంలో పడ్డారా ఇంకా తెలియదని తెలిపింది. ఆ విమానం సిరియా గగనతలంలోకి వెళుతోందని చెప్పింది.
Mobile AppDownload and get updated news