కృష్ణా జిల్లా: మచిలీపట్నం మండలం నిజాంపేటలో గుర్తుతెలియని దండగులు వంగవీటి రంగా విగ్రహాన్ని కూల్చివేశారు. ఈ ఘటన ఆదివారం ఉధయం వెలుగులోకి రావడంతో ఘటనా స్థలం వద్ద భారీ ఎత్తున రంగా అభిమానులు, కాపు సంఘం నేతలు చేరుకున్నారు. తమ అభిమాన నేత విగ్రహాన్ని కూల్చివేసి కాపు జాతిని అవమానించారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ధర్నాను విరమించాలని కోరారు. నిందితులను శిక్షించే వరకు తమ ఆందోళన విరమించేదిలేదని అభిమానులు భీష్మించి కూర్చున్నారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఆయుధాలతో వచ్చి విగ్రహాన్ని కూల్చివేశారని.. ఉద్దేశపూర్వకంగానే ఈ దుశ్చర్యకు పాల్పాడ్డారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు
నిందితులను కఠినంగా శిక్షిస్తాం - మంత్రి కొల్లు
వంటవీటి రంగా విగ్రహం కూల్చివేత నేపథ్యంలో ఘటనా స్థలం చేరుకున్న మంత్రి కొల్లు రవీంద్ర కాపు నేతలను సముదాయించేందుకు ప్రయత్నించారు. ధర్నాను విరమించాలని ..నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు సంఘ విద్రోహ శక్తులు శాంతియుతవాతావరణాన్నిచెడగొట్టాలనే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడ్డారని ..ఇలాంటి సందర్భంలో అభిమానులు సంయమనం పాటించాలని కోరారు. ఇదే స్థానంలో వంగవీటి రంగా కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు హామీ ఇచ్చారు.
Mobile AppDownload and get updated news