బాలీవుడ్ నటి దీపికా పదుకునే బాహుబలి-2లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది అంటూ గత మూడ్నాలుగు రోజులుగా కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా ఐయాన్స్ వెల్లడించిన కథనాన్నిబట్టి చూస్తోంటే అదంతా జస్ట్ రూమర్స్ మాత్రమేనని తేలిపోయింది. ఐయాన్స్ కథనం ప్రకారం అసలు దీపికా పదుకునేని బాహుబలి-2లో చేయమని ఎవ్వరూ అడగనేలేదని తెలుస్తోంది. 'దీపికా తమ సినిమాలో నటిస్తోందనే కథనాలు ఎలా మొదలయ్యాయో ఏమో మాకు కూడా అర్థం కావడం లేదు' అని మూవీ యూనిట్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్, అనుష్కలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు. మే నెల నుంచి రానా దగ్గుబాటి కూడా ఈ షూటింగ్‌కి హాజరుకానున్నాడు.
Mobile AppDownload and get updated news