టీ20 వరల్డ్ కప్ సమరం తుదిపోరుకి సిద్ధమైంది కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్. ఉత్కంఠభరితంగా సాగిన సెమీ ఫైనల్ పోరు దాటుకుని ఫైనల్స్‌కి చేరిన ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్ జట్లు ఈ మ్యాచ్‌లో ఒకదానితో మరొకటి తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టీ20 వరల్డ్ కప్ 2016 టైటిల్ చేజిక్కించుకుని టీ20 ఛాంపియన్స్ అనిపించుకోనుంది. టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ కెప్టేన్ డారెన్ సమీ ఇంగ్లాండ్‌పై మొదట ఫీల్డింగ్ చేయడానికే ఎంచుకున్నాడు. దీంతో అంతిమ పోరుకి దిగిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్.. వెస్ట్ ఇండీస్ బౌలర్లు విసిరే బంతుల్ని సమర్థవంతంగా ఎదుర్కుని వారికి భారీ లక్ష్యాన్ని నిర్ధేశించే ప్రయత్నాల్లో వున్నారు. కానీ మొదటి రెండు ఓవర్లలోనే కేవలం 8 పరుగులకే ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోవడం ఆ జట్టుకి నిజంగానే ఓ మైనస్ పాయింట్.
Mobile AppDownload and get updated news