టి 20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న తర్వాత విండీస్ కెప్టెన్ డారెనె సామీ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ క్రికెట్ బోర్డు మండిపడింది. పోటీలో గెలిచినంత మాత్రాన బోర్డుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికింది. తమ క్రికెట్ బోర్డుపై తమకు ఎంత మాత్రం గౌరవం ఇవ్వడం లేదని ..ఎంతో కిష్టపరిస్థితుల్లో టి 20 వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ కు వచ్చామని.. ఆటగాళ్లకు సరైన దుస్తులు కూడా అందుబాటులో లేవంటే మా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని డారెన్ సామీ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సీరియన్ గా తీసుకున్న విండీస్ బోర్టు డారెస్ సామీకి ఇలా క్లాస్ పీకింది.
ఇదిలా ఉండగా టి 20 ఫైనల్ పోరు సమయంలో విండీస్ కెప్టెన్ డారెస్ సామీ ఇంగ్లండ్ బౌలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన ఐసీసీ.. నిజమేనని నిర్థారించుకుంది. దీంతో సామీ మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమాన విధించింది. ఒక వైపు వరల్ట్ టైటిల్ సాధించిన సంతోషంలో ఉన్న సామీకి ఈ పరిణామాలు ఏమాత్రం మింగుపడటం లేదు.
Mobile AppDownload and get updated news