టీ20 వరల్డ్ కప్ తుదిపోరులో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్ట్ ఇండీస్... ఇంగ్లాండ్ ఆటగాళ్లని కట్టడీ చేయడంలో సక్సెస్ అయింది. వెంటవెంటనే కీలకమైన వికెట్లు తీసుకుంటూ ఇంగ్లాండ్ జట్టుని దెబ్బతీసిన విండీస్ ఆటగాళ్లు అడుగడుగునా మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. విండీస్ బౌలర్లని ఎదుర్కోవడంలో మొదటి ఓవర్ నుంచే కష్టపడిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు అతికష్టంమీద నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగారు. వెస్ట్ ఇండీస్ లాంటి జట్టుకి ఈ స్కోర్‌ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ... ఇంగ్లాండ్ ఆటగాళ్ల బౌలింగ్, ఫీల్డింగ్‌పైనే ఇక ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి వుంది. ఈ టీ20 వరల్డ్ కప్ ఎవరి వశమవుతుందో ఇంకొద్దిసేపట్లో తెలిపోనుంది.
Mobile AppDownload and get updated news