Mobile AppDownload and get updated news
విండీస్ బోర్డుపై ఆటగాళ్ల విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా జట్టులోని కీలక ఆటగాడు బ్రావో..తమ బోర్డుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తాము ప్రపంచ కప్ సాధించినా బోర్డు సభ్యులెవరూ తమకు అభినందనలు తెలపలేదన్నాడు. అసలు తాము వరల్డ్ కప్ గెలవడం మా బోర్టుకు ఇష్టలేదని బ్రావో పేర్కొన్నాడు. తమ కు విండీస్ క్రికెట్ బోర్డు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని మీడియా ముందు ఆవేదన వ్యక్త చేశారు. విండీస్ బోర్డు కంటే తమకు బీసీసీఐ బాగా చూసుకుంటోందని.. మా బోర్టు కంటే బీసీసీఐ ఎన్నోరెట్లు నయమని బ్రావో అభిప్రాయడ్డారు. వరల్డ్ కప్ గెలిచిన సందర్భంలో కెప్టెన్ సామీ బోర్డుపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. సామీ వ్యాఖ్యలపై విండీస్ బోర్టు ఘాటుగా స్పందించిన కొన్ని గంటల్లోనే విండీస్ లోని మరో కీలక ఆటగాడు బ్రోవో బోర్డుపై విరమ్శలు కురిపించడం విశేషం. దీంతో కెప్టెన్ సామీకి ఆటగాళ్ల మద్దతుందనే విషయం బహిర్గతమైంది. గత కొంత కాలంగావిండీస్ బోర్డు - ఆటగాళ మధ్య వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే.