దర్శకుడు మాట్లాడుతూ ``సుమంత్ అశ్విన్ కెరీర్‌లో మంచి సినిమా అవుతుంది. `లవర్స్`, `కేరింత` సినిమాల సక్సెస్‌లో ఉన్న ఆయనకు ఈ సినిమా గుర్తుండిపోతుంది. నాజర్ చాలా అద్భుతమైన పాత్రను పోషించారు. తొలి సగం వినోదాత్మకంగా సాగుతుంది. మలి సగంలో మిస్టరీ ఉంటుంది. మొత్తానికి ఉత్కంఠభరితంగా సాగే చిత్రమవుతుంది. `బాహుబలి` ప్రభాకర్ ఇందులో డ్రైవర్‌గా, సుమంత్ అశ్విన్ కండక్టర్‌గా కనిపిస్తారు. మలయాళంలో ఘన విజయాన్ని మూటగట్టుకున్న `ఆర్డినరీ` సినిమా స్ఫూర్తితో తెరకెక్కిస్తున్నాం. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేశాం. ఎస్.కోట నుంచి గవిటికి వెళ్లే ఓ ఆర్టీసీ బస్సు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. కామెడీ, లవ్, మిస్టరీ అంశాలున్న చిత్రమిది`` అని తెలిపారు. నాజర్, ధనరాజ్, `షకలక` శంకర్, తాగుబోతు రమేశ్, జీవా, రాజా రవీంద్ర, భరత్‌రెడ్డి, వినోద్, పావని, కరుణ, జయవాణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాటలు: శ్రీమణి, కెమెరా: శేఖర్ వి.జోసఫ్, మాటలు: `డార్లింగ్` స్వామి, ఆర్ట్ : కె.ఎమ్.రాజీవ్, కో ప్రొడ్యూసర్: జె.శ్రీనివాసరాజు, నిర్మాత: జె.వంశీకృష్ణ, దర్శకత్వం: మను, సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు.
Mobile AppDownload and get updated news