ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని టి. జేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం బిద్రెలి గ్రామంలో రైతు కరవు యాత్రలో మంగళవారం కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆయన రైతులతో ముఖాముఖీ నిర్వహించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారని.. వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని.. తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని టి.సర్కార్ కు కోదండరాం డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రజా సమస్యలపై పోరాటానికి దూరంగా కోదండరాం.. రాష్ట్రంలో రైతులు పడుతున్న అవస్థలను నేరుగా చూసేందుకు రైతు కరవు యాత్ర చేపట్టారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో చురుగ్గా పాల్గొని.. తెలంగాణ ఆవిర్భావానికి ప్రదాక కారకుల్లో ఒకరైన కోదండరాం తెలంగాణ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఆయన యాత్రతోనేనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని రైైతన్నలు ఆశతో ఎదురుచూస్తున్నారు.
Mobile AppDownload and get updated news